ఎండలతో జాగ్రత్త.. తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన బడుగుల పిచ్చయ్య (63) అనే వ్యక్తి కూలి పనికి వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పొలంపల్లి నాగయ్య గుంపునకు చెందిన పొడుగు శేషగిరి (35) అనే వ్యక్తి వాడెదబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందారు.

కొమరంభీం జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మానేపల్లి గొంతయ్య (19) అనే రైతు పొలంలో పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతి చెందారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతంపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య (49) అనే వ్యక్తి కూలి పనులకు వెళ్లి వడదెబ్బ తగలడంతో మృతి మృతి చెందారు.