వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే.. సొంతిల్లు కూడా లేదు.. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. తనకు వారసత్వంగా వచ్చిన గుంటల భూమిని కూడా ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారు మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్. సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబ సభ్యుల దీనస్థితి నెలకొంది.

ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కూడా సగం కూలిపోతే, మిగిలిన దాని పైన మీద టార్పాలిన్ కవరు కప్పి… ఆ కొద్ది జాగాలోనే తోటికోడలితో తలదాచుకుంటున్నారు. ఇల్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని మాటలు చెప్పిన నేతలు, అధికారులు ఎవ్వరూ ఇప్పుడు పట్టించుకోవట్లేదని మల్సూర్ కుటుంబీకుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటోంది మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ. ఇప్పుడు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ విషయం వైరల్ గా మారింది.