గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా హైదరాబాద్ లోనే : కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

-

తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఇవాళ గాంధీ భవన్ లో మీడియాకి వివరించారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయలేదు. గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా హైదరాబాద్ లోనే ఉండటం గమనార్హం. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ బృతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు.

తెలంగాణలో నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. తెలంగాణలో అర్భన్ నిరుద్యోగత దేశ సగటు కంటే అధికంగా ఉందని తెలిపారు చిదంబరం. తెలంగాణ రాష్ట్ర అప్పు 3.66 కోట్లకు చేరుకుందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగింది. నిరుద్యోగ, అధిక ధర వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు అన్ని కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version