దీపావళి విశిష్టత ఏంటి..? దీపాలను ఎందుకు వెలిగించాలి..?

-

దీపావళి పండుగను హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు, ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించి భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకుంటారు. చిన్నపిల్లలు మొదలు పెద్ద వాళ్ల వరకు దీపావళి పండుగను జరుపుకోవడానికి సంబరపడతారు. హిందువులే కాదు బుద్ధులు, జైన్లు, సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ దీపావళిని జరుపుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళిని జరుపుకుంటాము ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ 31న వచ్చింది. దీపావళి గురించి రామాయణంలో కూడా వివరించారు.

పురాణాల ప్రకారం భూదేవి వరాహ స్వామికి అసుర సమయంలో నరకాసురుడు పుడతారు. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే చనిపోయే విధంగా వరం పొందుతారు. ఆ గర్వంతో ముల్లోకాలని పీడిస్తూ ఉంటాడు. దేవతలు మునులు గంధర్వులు ఆ బాధను చూడలేక శ్రీహరికి చెప్తారు. వారి మొర ఆలకించిన మహావిష్ణువు కృష్ణుడిగా అవతరిస్తారు. సత్యభామతో నరకాసురుడిని సంహరింప చేస్తారు. ఇలా అయినా చనిపోయిన సందర్భంగా ఆనందంగా ప్రజలు ఈ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు.

నరక చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దీపావళి పదానికి అర్థం ఏంటంటే దీపాల వరుస. కొన్ని చోట్ల దీపావళిని ఐదు రోజులు పాటు జరుపుతారు. ఇంటి ఆవరణ మొత్తం నువ్వుల నూనెతో మట్టి ప్రమిడీలతో వెలిగించిన దీపాలతో అందంగా అలంకరిస్తారు. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవిని ఆరాధిస్తారు లక్ష్మీదేవిని దీపావళి నాడు ఆరాధించడం వలన ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. బంగారు వెండి ఆభరణాలను కొని పూజలు పెడతారు వ్యాపారస్తులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుని లక్ష్మీదేవి కలగాలని పూజలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version