Hyderabad : నాలాలో పడి చిన్నారి మృతి.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన మేయర్‌

-

 

సికింద్రాబాద్‌లో కురిసిన వర్షానికి నాలాలో పడి 11ఏళ్ల మౌనిక అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసీగూడలో నివాసం ఉండే మౌనిక ప్రతిరోజూ లాగే తన తమ్ముడితో కలిసి పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లి నాలాలో పడి కొట్టుకుపోయింది. వెంట ఉన్న తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. తమ కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఈ ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌనిక మృతిచెందిన ఘటనాస్థలిని సందర్శించారు. మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్‌… పలుమార్లు హెచ్చరించినా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. చిన్నారి మౌనిక కుటుంబానికి మేయర్‌ పరామర్శించి… 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. GHMC సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version