Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

-

Gold Rates : ఇండియాలో భారీగా బంగారం పెరుగుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్ అందింది. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on january18th

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి, రూ. 62, 950 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి, రూ. 57, 700 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ. 77, 400 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version