తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది విద్యాశాఖ. ఫలితాలు విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 24న బుధవారం ఉదయం 11 గంటలకు ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఫలితాలు విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అయింది. స్పాట్ వాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఈ ఏడాదికి ఇంటర్మీయట్ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాగా.. 4 లక్షకు పైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. వీరందరూ పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఇంటర్మీయట్, పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. దీంతో విద్యార్థులు తెలంగాణ పరీక్ష ఫలితాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.. ఏపీలో ఏ ఫలితాలు అయినా ముందుగానే విడుదల చేస్తున్నారు అంటూ కాస్త ఆగ్రహంగా ఉన్నారు.