మాంసం ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా చికెన్ ధరలు తగ్గిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరింత తగ్గాయి. రెండు నెలల కిందట విత్ స్కిన్ కేజీ రూ. 240, స్కిన్ లెస్ రూ. 260 వరకు పలకగా…. ఇప్పుడు దాదాపు రూ.100 తగ్గింది.
ప్రస్తుతం కేజీ విత్ స్కిన్ రూ. 120, స్కిన్ లెస్ రూ. 140గా ఉంది. కొన్నిచోట్ల రూ. 100కే కేజీ చికెన్ విక్రయిస్తున్నారు. అయితే కార్తీకమాసం ముగుస్తుండటంతో రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో… కార్తిక మాసం హడావీడి ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో చాలా మంది నాన్ వెజ్ తినడం లేదు. ఇలాంటి తరుణంలోనే.. భారీగా చికెన్ ధరలు తగ్గిపోయాయి.