గర్భిణులకు శుభవార్త.. TRS సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని గర్భిణులకు శుభవార్త. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు, అందులోని నార్మల్ డెలివరీస్ ను పెంచేందుకు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ, గర్భిణీలకు శుభవార్త వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను హోంమంత్రి మహమూద్ ఆలీతో కలిసి మంత్రి హరీష్ రావు వర్చువల్ గా ప్రారంభించారు.

పెట్ల బురుజు ఆసుపత్రి నుంచి మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, అనంతరం మాట్లాడారు. ఈ రోజు ఏకంగా 56 టిఫా లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మాతా, శిశు సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ కిట్ పథకాన్ని పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి వేదికగా జూన్ 2, 2017 న సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారని గుర్తు చేశారు.