తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇవాళ స్కూల్స్‌, కాలేజీలు బంద్‌

-

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇవాళ స్కూల్స్‌, కాలేజీలు బంద్‌ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

schools

అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. షబ్-ఎ-మెరాజ్ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఇవాళ ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version