తెలంగాణ రైతులకు శుభవార్త..రేపు అకౌంట్లలోకి డబ్బులు రాబోతున్నాయి. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..కీలక ప్రకటన చేసింది. అయితే ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాల్లో తప్పుల కారణంగా పలువురు రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రూ.2,747.67 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
నిన్న (శనివారం) సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయగా.. ఈరోజు ఆదివారం బ్యాంకులకు సెలవు కావటంతో సోమవారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. దీంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సహా తాను ఎవ్వరి బెదిరింపులకు భయపడనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను భయపడితే ఇంత దూరం రానని.. పుట్టింది, పెరిగింది నల్లమల్ల అడవుల్లో అన్నారు. పులులను చూశా.. అడవిలో ఉండే అన్ని మృగాలను చూశాను. తోడేళ్లను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా.. మానవ మృగాలు మీరెంత..? నా కాలు గోటితో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.