ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేవుడికి హారతిస్తూ ప్రమాదవ శాత్తు చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు దుర్మరణం పాలైంది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని చౌక బజార్ వీధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మగాటపల్లి సీతారత్నం (81) అనే వృద్ధురాలు నవంబర్ 24వ తేదీన తన ఇంట్లో ఉన్న దేవుడి గదిలో పూజ చేసింది.
ఈ క్రమంలోనే పూజ చేశాక దేవుడికి కర్పూర హారతి ఇచ్చింది. అది కాస్త పొరపాటున తన ఒంటిపై పడటంతో చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాలపాలైంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉండే అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం రాత్రి కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.