తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈ రోజు లేదా రేపు అకౌంట్లోకి డబ్బులు

-

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈ రోజు లేదా రేపు అకౌంట్లోకి డబ్బులు పడనున్నాయి. రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో ఈరోజు (సోమవారం) లేదా రేపు ఎకరానికి రూ.6వేల చొప్పున నిధులు జమ చేయనుంది.

Good news for Telangana farmers The money is going to fall into the account today or tomorrow

ఇప్పటికే ఒక ఎకరం భూమి ఉన్న 17 లక్షల మందికి రూ.6వేల చొప్పున నగదు జమ అయిన విషయం తెలిసిందే. డబ్బులు జమ కాని వారు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇక అటు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల మహా ధర్నాకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొడంగల్ వెళ్లనున్నారు కేటీఆర్. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన తర్వాత ఇదే మొదటిసారి కేటీఆర్ వెళ్లడం. ఈ రోజు మధ్యాహ్నం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో… గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version