తెలంగాణ రేషన్ డీలర్లకు శుభవార్త..ఇకపై కారుణ్య నియామకాలు

-

తెలంగాణ రేషన్ డీలర్లకు శుభవార్త.. రేషన్ డీలర్లకు సంబంధించి మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ఎవరైనా రేషన్ డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం కింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీలర్ షిప్ ఇచ్చేందుకు వయస్సు పరిమితిని పెంచింది.

ప్రస్తుతం 40 ఏళ్లుగా ఉండగా, 50 ఏళ్లకు పెంచుతూ పౌరసరాఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో బాధిత కుటుంబంలో 50 ఏళ్లలోపు ఎవరైనా డీలర్ షిప్ తీసుకోవచ్చు. అయితే, కనీస వయసు 18 ఏళ్ళు నిండాలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version