తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంచారు. పదవ తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5వ తేదీకి పెంచినట్లు… తెలంగాణ విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటన చేశారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు… గురువారం వరకు అవకాశం ఉండేది. అయితే ఆ గడువు నిన్నటితో ముగిసింది.
ఈ నేపథ్యంలో టీచర్లు అలాగే విద్యార్థుల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో పరీక్ష ఫీజు గడువును.. డిసెంబర్ ఐదో తేదీ వరకు పెంచారు. దీంతో 50 రూపాయల ఫైన్ తో డిసెంబర్ ఐదో తేదీ వరకు పరీక్ష ఫీజు కట్టుకోవచ్చు. ఆ తర్వాత డిసెంబర్ 12వ తేదీ వరకు 50 రూపాయల ఫైన్ తో… పదో తరగతి పరీక్ష ఫీజు కట్టుకోవాలి. అలాగే 19వ తేదీ వరకు 200 రూపాయలు ఫైన్ పడుతుంది. డిసెంబర్ 30వ తేదీ వరకు 500 రూపాయల ఫైన్ విధిస్తారు. కాగా ఈసారి ఇంటర్నల్ మార్కులు లేకుండానే.. వంద మార్కుల మెయిన్ పేపర్ నిర్వహించబోతున్నారట.