Good news for Telangana women: తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ప్రతి నెలా రూ. 2, 500 జమ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని జులై 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్‌లో నెలనెలా రూ. 2, 500 జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం.
కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు ఘటనలతో ప్రతిపక్షాలు కూడా ఈ శాఖల మంత్రులు కనిపించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం.