గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే ఆ ఫలితాలు

-

తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు-1 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల నియమానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా.. మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో కేవలం 67.17 శాతం మాత్రమే మెయిన్స్ పరీక్ష రాశారు.

ఈ గణాంకాల ప్రకారం.. ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్ జవాబు మూల్యాంకనం పూర్తి చేసినట్టు ప్రకటించింది. గ్రూపు
-1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు టీజీపీఎస్సీ తుది సమీక్ష చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వారం నుంచి పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశముంది. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. గ్రూపు-1 నియామక ప్రక్రియను పూర్తి చేసిన తరువాతనే గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news