యాదగిరిగుట్ట స్థానికులకు గుడ్ న్యూస్ అందింది. యాదాద్రి ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం 5గంటల నుండి 5.30 ని.కు ఉచితంగా యాదగిరిగుట్ట స్థానికులకు, బ్రేక్ దర్శనం సదుపాయం కల్పించనున్నారు. స్థానిక చిరునామా ఐ.డి ప్రూఫ్, సాంప్రదాయ దుస్తులతో వచ్చే స్థానికులకు మాత్రమే గర్భాలయ దర్శనం ఉంటుంది.
ఇక ఆలయ ఈవో భాస్కర్ రావు నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిత్యాన్న ప్రసాదం సదుపాయాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా వెయ్యి మంది భక్తులకు అన్నదానం సదుపాయం కల్పిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భాస్కర్‌రావు వెల్లడించారు. ఇప్పటి వరకు 600 మంది భక్తులకు నిత్యాన్న ప్రసాదం కల్పిస్తున్నామని, ఇక నుంచి మరో 400 మందికి పంపిణీ చేస్తామని వెల్లడించారు. స్థానిక భక్తులకు ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అరగంట పాటు దైవదర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని, వారు గర్భాలయంలోకి ప్రవేశించవచ్చని పేర్కొన్నారు.