Heavy rains for Telangana for 4 days Yellow alert issued: హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణకు నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. భారీ వర్ష సూచనతో తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..మరో మూడురోజుల్లో తెలంగాణను నైరుతి రుతుపవనాలు.. తాకనున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే కర్ణాటకను తాకిన నైరుతి రుతుపవనాలు..తెలంగాణను నైరుతి రుతుపవనాలు.. తాకనున్నట్లు వెల్లడించింది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు..తగ్గనున్నాయి. కాగా, హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. ఈరోజు(సోమవారం) నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, నిన్న(ఆదివారం) రాత్రి ముషీరాబాద్, ఆసిఫ్‌నగర్, షేక్‌పేట్, అంబర్‌పేట్, బహదూర్‌పురా, సైదాబాద్, బండ్లగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. చెట్లను తొలగిస్తున్నారు.