DSC అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త..ర DSC 2024 లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని ఇప్పటికే ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.