ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రజల ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ మేనిఫెస్టో లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేర్చిన శ్రీధర్ బాబు కు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఘనత దక్కుతుందని వెల్లడించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 20 వేల కోట్లకు 11వేల కోట్లు ఇచ్చారని…. రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వలే, గిట్టుబాటు ధర ఇవ్వని ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లిందని తెలిపారు. రైతులు కాలర్ ఎగరేసుకున్న రోజు రావాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారు… భారతదేశంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసె రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుంది.. ఎలాంటి వాతావరణంలోనైనా ఆయిల్ ఫామ్ సాగు అనుకూలంగా ఉంటుంది…పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించిందని వివరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.