అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన ఆరోగ్యం, వయోభార సమస్యలనే ప్రధాన కారణంగా చూపిస్తున్న డెమోక్రాట్లకు మరో కారణం దొరికినట్లయింది. బహిరంగ వేదికలపై తన వింత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్న బైడెన్‌కు సంబంధించి మరో పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బైడెన్ తన భార్య జిల్ అనుకుని ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయినట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో ఎప్పటిదో మాత్రం తెలియరాలేదు.
ఓ కార్యక్రమంలో బైడెన్ సదరు మహిళతో మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆమెకు దగ్గరగా వెళ్లి దాదాపు ముద్దు పెట్టుకోబోయే స్థితిలో కన్పించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ సతీమణి జిల్ దాన్ని గమనించి వెంటనే అధ్యక్షుడిని నిలువరించడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది మహిళను అక్కడినుంచి పంపించేశారు. ఇప్పటికే బైడెన్ ఆరోగ్య సమస్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నవేళ ఈ వీడియో బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
OMG Joe thought that woman was Jill.
She had to run and show him it wasn’t her. Watch his face.
— Sara Rose 🇺🇸🌹 (@saras76) July 18, 2024