సింగరేణి కార్మికులకి శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్

-

సింగరేణి కార్మికులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త అందించింది. సింగరేణి కార్మికులకు 68500 రూపాయలు దీపావళి బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 కల్లా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ కానుంది. మొత్తం 43 వేల మంది సిబ్బందికి ఈ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పడనుంది. ఇక నిజానికి గత నెలలోనే సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ఇవ్వనున్నట్టు సంస్థ అధికారులు ప్రకటించారు.

singareni

సీఎం కేసీఆర్ ఆదేశాలతో, కార్మికులకు లాభాల బోనస్ 28శాతంను.. ఈనెల 23న చెల్లిస్తున్నట్లు సింగరేణి సంస్థ ఎండీ ఎన్ . శ్రీధర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గానూ 278. 28 కోట్ల రూపాయలను.. ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సగటున ఒక్కో కార్మికునికి 60 వేల 500 రుపాయలు లాభాల బోనస్ లభించే అవకాశం ఉందని అన్నారు. కరోనా లాక్‌ డౌన్ కారణంగా మినహాయించిన జీతాన్ని, గత నెల 23వ తేదీన ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. మరి అవీ ఇవీ ఒక్కటేనా లేక అవి వేరు ఇవి వేరు ? నా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version