తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఖమ్మం స్టడీ సర్కిల్లో 100 చొప్పున, హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో 200 మందికి ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ. 5వేల చొప్పున 3 నెలల పాటు ఉపకార వేతనం ఇస్తామన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని 15 బీసీ స్టడీ సర్కిళ్లు, స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 182 మంది గ్రూప్-1 ప్రధాన పరీక్షకు అర్హత సాధించారని అలోక్ కుమార్ తెలిపారు.
గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనకు గురువారం సాయంత్రానికి 5.31 లక్షల మంది దరఖాస్తు చేశారు. గ్రూప్-2 పోస్టులకు రెండు రోజులకు కలిపి దరఖాస్తుల సంఖ్య 42,100 దాటింది.