Goodbye Kova Lakshmi to BRS party: బీఆర్‌ఎస్ పార్టీకి కోవ లక్ష్మి గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి కోవ లక్ష్మీ వెళతారని ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై కోవ లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారటం లేదు….కొంతమంది కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. పదేళ్లు పదవులు అనుభవించి ఇవాళ మోసం చేసి పోతున్నారని మండిపడ్డారు కోవ లక్ష్మి.
ఇక అటు పార్టీ మారిన వాళ్ళకు సిగ్గు, శరం, లజ్జ లేదని… హుజురాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు….దీనిపై కోర్టు లో పిటిషన్ వేసానని వెల్లడించారు. కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది….స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. GO ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది…. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి అన్న ఏ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఏ హోదాలో ఆయన పంచుతున్నారు.