రోజువారి ఆహారం ఎప్పుడు పోషక విలువలతో నిండి ఉండాలి. ఎప్పుడైతే మంచి ఆహారాన్ని తీసుకుంటారో ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది. అయితే చిన్న పిల్లలు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారాన్ని తీసుకోవడం వలన ఎదుగుదల చాలా బాగుంటుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన చిన్న వయసులోనే డయాబెటిస్, హైబీపీ వంటి మొదలైన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
చిన్నపిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు, పాలు వంటి మొదలైన ఆహార పదార్థాలను ఇవ్వాలి. స్వీట్లు, చాక్లెట్లు వంటివి ఎక్కువగా తినడం వలన ఆరోగ్యానికి మరింత ప్రమాదం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీటివలన దంతాలకు సంబంధించిన సమస్యలు రావడంతో పాటుగా ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎదురవుతాయి. సహజంగా చిన్నపిల్లలు జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. డీప్ ఫ్రై చేసినటువంటి చిప్స్, బర్గర్స్, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలను ఎక్కువగా తినడం వలన అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శరీరంలో ఎక్కువ అవుతాయి. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు, హైబీపీ వంటివి ఎదురవుతాయి.
చిన్నపిల్లలు తినే ఆహారంలో ఉప్పును ఎక్కువగా ఉపయోగించకూడదు. ఉప్పును ఎక్కువగా ఉపయోగించడం వలన శరీరంలో సోడియం ఎక్కువ అవుతుంది. దీంతో అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది పంచదార వంటివి అనారోగ్యకరం అని తేనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సంవత్సరం కంటే తక్కువ వయసు ఉండేటువంటి పిల్లలకు తేనెను అస్సలు తినకూడదు. తేనెలో బోటులిజం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే చిన్న వయసులోనే తేనెను పిల్లలకు అందిస్తారో ఎంతో ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. కనుక ఏడాది కంటే తక్కువ వయసు ఉండేటువంటి పిల్లలకు తేనెను కూడా పెట్టకూడదు. కనుక చిన్న పిల్లలకు ఇటువంటి ఆహార పదార్థాలను ఇవ్వకపోవడమే మేలు.