తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతోందనేది స్పష్టంగా తెలుస్తోంది. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గవర్నర్ తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని అనడం సరికాదని… 100 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. గవర్నర్ మనసులో ఏముందో ప్రజలకు అర్థం అవుతుందని సత్యవతి రాథోడ్ అన్నారు.
గవర్నర్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు… ప్రభుత్వం కూలిపోతుంది అనడం సరికాదు: సత్యవతి రాథోడ్
-