నేడు కేంద్ర మంత్రి అమిత్ షాతో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై భేటీ

-

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో స‌మావేశం కానుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కోసం గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీలికి బ‌య‌లు దేరారు. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో స‌మావేశం కానున్నారు. అయితే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఢిల్లీ ప‌ర్య‌ట‌న సోమవారమే ఉండాల్సింది. సోమ‌వారం ఢిల్లీకి వెళ్లి.. మంగ‌ళ వారం కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉంది.

కానీ సోమ‌వారం నాటి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై స‌మావేశం కానుంది. కాగ తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల గురించి అమిత్ షాతో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన విషయం తెలిసిందే.

దీని పై కేంద్ర మంత్రి అమిత్ షాతో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఎమ్మెల్సీ గా పాడి కౌశిక్ ప్ర‌భుత్వ‌ ప్ర‌తిపాద‌న నుంచి నిన్న‌టి ఉగాది వ‌ర‌కు రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల గురించి కేంద్ర మంత్రి అమిత్ షాకు వివ‌రించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version