కేసీఆర్​కు మళ్లీ షాక్.. RTC బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్‌ తమిళిసై

-

ముఖ్యమంత్రి కేసీఆర్​ సర్కార్​కు మరో షాక్ తగిలింది. రాష్ట్ర గవర్నర్-ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా గవర్నర్ తమిళిసై తెలంగాణ ఆర్టీసీ బిల్లును తిరస్కరించారు. ఈ శాసనసభ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు ప్రభుత్వం ఈ బిల్లును అనుమతి కోసం పంపింది.

రెండ్రోజులు గడచినా రాజ్‌భవన్ నుంచి ప్రభుత్వానికి ఆర్టీసీ బిల్లుకు సంబంధించి అనుమతి అందలేదు. ఇప్పుడు తాజాగా ఆ బిల్లును గవర్నర్ ఆమోదించలేదనే విషయం తెలిసింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఇప్పుడు ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సభలో ప్రభుత్వం 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది..అందులో 4 గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులున్నాయన్న విషయం తెలిసిందే. ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టి.. మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news