మీడియాపై దాడి చేసిన బేబీ నిర్మాత SKN..వీడియో వైరల్‌ !

-

బేబీ సినిమా రిలీజ్ అయి దాదాపుగా 20 రోజులు కావొస్తోంది. అయినా అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డే కనిపిస్తోంది. సినిమా గురించి మంచి టాక్ బయటకు రావడంతో అంతా ఈ సినిమాకే పచ్చజెండా ఊపుతున్నారు. ముఖ్యంగా నెట్టింట మీమ్స్ చూసిన యువత ఈ చిత్రాన్ని చూసేందుకు క్యూ కడుతోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నెమ్మదిగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ రూ.80 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

కేవలం 20 రోజుల్లోనే ఈ ఫీట్‌ను అందుకుందంటే మామూలు విషయం కాదు. ఇది ఇలా ఉండగా… తాజాగా బేబీ సినిమా నిర్మాత SKN ఓ వివాదంలో చిక్కుకున్నాడు. భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. కవరేజ్ కు వచ్చిన మీడియాపై బౌన్సర్లతో దాడి చేశారు. అలాగే మీడియా ప్రతినిధులపై నిర్మాత SKN దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘర్షణలో కొంత మంది జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు…అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news