ఔను! ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ చేయాల్సిన సమీక్షలు, సమా వేశాలకు ఇప్పుడు మాస్కు పెట్టుకుని ఆ రాష్ట్ర గవర్నర్ తెరమీదికి వచ్చారు. అన్నీ తానే అయి నడిపిస్తున్నారు. తాజాగా కరోనా స్థితిగతులపై గవర్నర్ తమిళ సై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యులతో భేటీ అయి సమీక్షించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రంలో కేసులు.. వాటితోపాటు మరణాలు పెరిగిపోతుండడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో అధికారులు, వైద్యుల పనితీరును ఆమె అడిగి తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడే ఇలా ఎందుకు జరుగుతోంది? కోర్టులు ఎందుకు కలుజేసుకోవాల్సి వస్తోందని గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ముఖ్యంగా జిల్లా వైద్యాధికారి అయిన సుల్తాను ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్బంధించండం.. ఈ విషయంపై అ ధికారులు సమయాను కూలంగా స్పందించకపోవడంపై గవర్నర్ ఫైరయ్యారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా ను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన గవర్నర్ తమిళిసై.. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. వాస్తవానికి సీఎం కేసీ ఆర్ ఉన్నప్పటికీ.. ఆయన తరచుగా సమీక్షలు చేస్తున్నప్పటికీ.. హఠాత్తుగా గవర్నర్ తెరమీదికి రావడం వెనుక ఏం జరిగిందనే చర్చ రాజకీయంగా ఊపందుకుంది.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈవిషయాన్ని మరింతగా తెరమీదికి తెచ్చింది. గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందనే ప్రచా రం సాగుతోంది. ప్రధాన మీడియా ఈ విషయంలో కొంత సంయమనం పాటించినా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఆగడం లేదు. మరోపక్క, ప్రభుత్వ వర్గాలు కూడా ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడేలా ఎక్క డా కేసీఆర్‌కు రాలేదని ఖండించడం లేదు. అలాగని వచ్చిందనే విషయాన్ని కూడా వెల్లడించడం లేదు.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గవర్నర్ తమిళిసై.. తెరమీదికి రావడం.. స్వతహాగా ఆమె వైద్యురాలు కావడం.. వంటివి ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఏదో జరిగిందని, ప్రభుత్వ పెద్ద చేయాల్సిన స మీక్షలు.. గవర్నర్ చేయడం ఏంటనే ప్రశ్న వస్తోంది. మరి ఏం జరిగిందో ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నా..వాస్తవం మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.