కేసీఆర్ పై గవర్నర్ తమిళసై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకీ శుభాకాంక్షలు తెలిపారు తమిళ సై. చాలా కింది స్థాయి నుంచి వచ్చింది… చాలా సింపుల్ పర్సన్..ఇది మహిళలకు దక్కిన గౌరవం అన్నారు. వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో తిరిగానని.. నేను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలును కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళానని పేర్కొన్నారు.ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లకపోవచ్చని పేర్కొన్నారు.
కేంద్ర రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం అసాధ్యం.. నేను ప్రోటోకాల్ ఆశించడం లేదు.. భద్రాచలం వెళ్లినా అధికారులు ఎవరూ రాలేదు.. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నేను పోల్చుకోనన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.వర్షాలలో ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాలు ఆదివాసీలో ఉన్న ప్రాంతాలు కాబట్టి భద్రాచలం ఏరియాలో తిరిగానని.. నేను తెలుగు ప్రజల కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. వర్షాల పై రిపోర్టుని కేంద్ర హోంశాఖ కు ఇచ్చాను… వాళ్లు కేంద్ర బృందాలను పంపించారని… కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుంది.. గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పారు. గవర్నర్ భవన్ కి ప్రగతి భవన్ గ్యాప్ పై స్పందించనీ గవర్నర్… నేను రాజకీయాలు మాట్లాడబోనని వెల్లడించారు.