సన్న బియ్యం పై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

-

సన్న బియ్యం పై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  రెండో సారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ అన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకొక మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.  ఇది మంచి పద్దతి కాదు.. అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

మంత్రుల గురించి ఎవ్వరూ పడితే వాళ్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అది మంచి పద్దతి కాదని సూచించారు. మంత్రి వర్గ విస్తరణ గురించి ఎవ్వరూ మాట్లాడకూడదన్నారు. రేపటి నుంచి ఎమ్మెల్యేలంతా జనంలోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెల్లాలని చెప్పారు. ప్రభుత్వం మూడు పథకాల గురించి సర్వే చేశామని.. వాటికి మంచి స్పందన వస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news