వాన కాలం పంట ను పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే తమ వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వం వాన కాలం వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో వరి ధాన్యం పోస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే రాష్ట్రం లో ఉన్న కేంద్ర మంత్రి కేషన్ రెడ్డి ఇంట్లో కూడా పోస్తామని అన్నారు. దీంతో పాటు వీలైతే 200 లారీ లు పెట్టి ఢిల్లీ కి వెళ్లి ఇండియా గేట్ వద్ద వరి ధాన్యం పార బోస్తామని సీఎం కేసీఆర్ అన్నాడు.
ముందు ముందు కేంద్రం తో యుద్ద మే ఉంటుందని అన్నారు. అలాగే యాసంగి బాయిల్డ్ రైస్ విషయం లో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేశిందని అన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయాలేదని స్పష్టం చేశారు. అయినా .. తమ పార్టీ ఎంపీ లు, నాయకులు బాయిల్డ్ రైస్ కోసం పోరాటం చేస్తామని అన్నారు.