తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. గ్రూప్-4 ఫలితాలకు ముహుర్తం ఫిక్స్‌ !

-

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. గ్రూప్-4 ఫలితాలకు ముహుర్తం ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఆగస్టు మొదటి వారంలో గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల చేసేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి, ఫైనల్ కీ విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ అంత ఆగస్టులో పూర్తిచేసి, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలని యోచిస్తోంది.

గురువారంతో OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. 20 రోజుల్లో 7.62 లక్షల OMR పత్రాలను స్కానింగ్ చేశారు. కాగా, టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓ వైపు సిట్.. మరోవైపు ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలతో మరి కొందరిని అరెస్టు చేసింది. ఇటీవలే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో మరో 10 మంది అరెస్ట్ అయ్యారు. నిందితులు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఇక మరికొంత మందిని అరెస్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సిట్‌ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news