నేడు పీసీసీ కమిటీ ముందుకు గూడెం మహిపాల్ రెడ్డి

-

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలకు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే పార్టీ క్రమశిక్షణా చర్యల కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నేడు పీసీసీ కమిటీ ముందు పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకానున్నారు.పటాన్ చెరులో జరుగుతున్న పరిణామాలపై పీసీసీ కమిటీ ముందు స్థానిక కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ రెడ్డి హాజరై ఫిర్యాదు చేశారు. దీంతో పీసీసీకి సమాధానం ఇవ్వాలని కోరగా..
సోమవారం నాడు సమావేశానికి రాలేనని, నేడు కమిటీ ముందుకు గూడెం మహిపాల్ రెడ్డి వెళ్తున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news