మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలి – గుత్తా సుఖేందర్ రెడ్డి

-

మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని పిలుపునిచ్చారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మూసీ ప్రక్షాళన పై బిఆర్ఎస్, బిజెపి తీరును ఎండగట్టిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నానని… గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని ఆగ్రహించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతం లోనే వేయికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.

ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. మాజీ పట్టణాభివృద్ధి మంత్రి తెలివి గా మాట్లాడుతున్నారన్నారు. ఆయన వైఖరి చూస్తే ఆశ్చర్యం వేస్తుందని వెల్లడించారు. ఆయన హయాం లో ఇష్టం వచ్చినట్టు గా భారీ అంతస్తులకు అనుమతులు ఇచ్చారు… డ్రైనేజ్, నాలాల వ్యవస్థలు గాలికి వదిలి వేశారని ఫైర్ అయ్యారు. అయితే.. గత సర్కార్‌ ను అంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డి..కేసీఆర్‌ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. మరి అప్పుడు అడగని గుత్తా సుఖేందర్ రెడ్డి..ఇప్పుడు కేసీఆర్‌ ను ఎందుకు అంటున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news