భారీగా వరద ప్రవాహం.. నిండుకుండలా తెలంగాణ ప్రాజెక్టులు!

-

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద తాకిడి భారీగా పెరిగింది. దీంతో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.9 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటిమట్టం పూర్తి స్థాయిని చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,225 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది.పూర్తిస్థాయి నీటి నిల్వతో శ్రీరాంసారగ్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది.శ్రీరాంసాగర్‌కు ఇన్ ఫ్లో 18,826 క్యూసెక్కులుగా ఉండగా..అధికారులు మూడు గేట్లను ఎత్తి 9,372 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా మరో 5,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news