టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేనేత కళాకారులు, ఆధారిత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేత సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశారు. ” ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా చేనేత దినోత్సవం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీలో నేత కార్మికులకు ప్రత్యేక స్థానం ఉంది. స్వతంత్ర ఉద్యమంలో చేనేత ప్రధాన భూమిక పోషించింది. చేనేత స్వతంత్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది.
గాంధీజీ కూడా రత్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతోనే జాతీయ చేనేత దినోత్సవం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేసి.. చేనేత కలను చంపేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నేతన్నకు అన్యాయం చేస్తున్న బిజెపి దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి.” అంటూ ట్విట్ చేశారు.
చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేసి ..
చేనేత కళను చంపేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోంది.నేతన్నకు అన్యాయం చేస్తున్న బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి.
— Revanth Reddy (@revanth_anumula) August 7, 2022