తెలంగాణ ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు – సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్‌. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలకూ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలనుభారత యూనియన్ లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం 17వ,సెప్టెంబర్ 1948 నాడు సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా భావించామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version