కేజ్రీవాల్ మీద విచారణ చేస్తూ ఉంటే..కవిత దొరికిందని..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలలేదని బీజేపీ పై ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ అవినీతి పరుడు అని బీజేపీ చెప్తుంది ఎందుకు విచారణ చేయట్లేదని.. కేసీఆర్ అవినీతి మీద ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ కు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని…100 పిటిషన్లను ఇచ్చాం ..ఎందుకు స్పందించలేదని కేంద్రం పై ఆగ్రహించారు రేవంత్ రెడ్డి.
సాయంత్రం తుక్కుగూడలో జరిగే ‘విజయభేరి’ సభలో కాంగ్రెస్ గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే సోనియా ప్రకటించే పథకాలు అమలు చేసేలా గ్యారెంటీ ఇస్తామన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనే అంశాలపై నిన్నటి CWC సమావేశంలో చర్చించామని…నేటి సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తామని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.