సర్పంచ్‌ లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు – హరీష్‌ రావు

-

సర్పంచ్‌ లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పరువు తీశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ లకు నిధులు ఇవ్వట్లేదని… కేంద్రం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని ఆగ్రహించారు. గ్రామ పంచాయతీ ల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని… సర్పంచ్ లు ఆగమయ్యాం అని నాకు వినతిపత్రం ఇస్తున్నారన్నారు.

Harish Rao wrote another open letter to CM Revanth Reddy

ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని…. గ్రామ పంచాయతీ ల ట్రాక్టర్ లకు డీజిల్ కూడా పోయట్లేదని ఆగ్రహించారు. ఉపాధి హామీ నిధులు కేంద్రం 850 కోట్లు నిధులు విడుదల చేసింది… 350 కోట్ల గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వాలని అవి విడుదల చేయడం లేదని ఫైర్‌ అయ్యారు. చాలా చోట్ల బిల్లులు రాలేదని స్కూళ్ల లో బాత్రూం లు ఓపెన్ చేయట్లేదన్నారు. సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడంతో చాలా నిధులు ఆగిపోతున్నాయన్నారు. అసెంబ్లీలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు… నేను లేవగానే 8 మంది మంత్రులు లేచి అడ్డుకుంటున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version