Papaya : పొరపాటున కూడా బొప్పాయితో పాటు వీటిని కలిపి తినొద్దు… జాగ్రత్త?

-

Papaya: బొప్పాయి మనకు ఎంతో విరివిగా లభించే పండ్లలో ఒకటి. బొప్పాయి పండు మనకు మన ఇంటి ఆవరణంలో కూడా లభిస్తూ ఉంటుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ బొప్పాయి పండును మనం తరచూ తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే సంగతి మనకు తెలిసిందే. ఇందులో ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ మినరల్స్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ వంటి ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా ఔషధాలు గని అయినటువంటి ఈ బొప్పాయి పండును తినేటప్పుడు ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బొప్పాయిని ఏ ఇతర పదార్థాలతో కలిపి తినకూడదు అనే విషయానికి వస్తే..

బొప్పాయిలో పప్పైన్‌, కైమోపపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇలాంటి ఎంజైమ్స్ ఉండటం వల్ల బొప్పాయి పండును ఎప్పుడు కూడా పాలతో పాటు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అజీర్తి కడుపులో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బాగా పండిన బొప్పాయి అలాగే పచ్చి బొప్పాయిని కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. పచ్చి బొప్పాయి కాస్త జిగురుగా ఉంటుంది. ఈ రెండిటిని కలిపి తినడం వల్ల గొంతు మంట అలర్జీ వచ్చే సమస్యలు అధికంగా ఉన్నాయి. పులియబెట్టిన ఆహార పదార్థాలలో పోషకాలు అధికంగా ఉంటాయి కనుక పులియ పెట్టిన ఆహార పదార్థాలతో పాటు బొప్పాయిని అసలు తీసుకోకూడదు.

బొప్పాయి అంటేనే సిట్రస్‌ పండు దీంతో ఇతర సిట్రస్‌ పండ్లు అంటే విటమిన్ సీ ఉండే ఆహారాలు తినకూడదు. ఇది యాసిడిటీ, గుండెమంటకు దారితీస్తుంది కనుక ఇతర సిట్రస్ జాతికి చెందిన పండ్లతో పాటు బొప్పాయిని అసలు తీసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version