కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే అమ్మకం – హరీష్‌ రావు

-

కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే అమ్మకం అంటూ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో సూపర్ హిట్ కాబట్టే కేసీఆర్ భరోసా అని పేరు పెట్టుకున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బిఎంఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన BRS పార్టీ బూత్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతుబంధు రూ.3 వేల కోట్లే బ్యాలెన్స్ ఉందని చెప్పారు. ఈసీ అనుమతి రాగానే వంద శాతం రైతుబంధు పూర్తిచేస్తామని ప్రకటించారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ చూస్తోందని ఆగ్రహించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని స్పష్టం చేశారు హరీష్ రావు. 30 రోజులు మనం అందరం కలిసి కష్ట పడితే, వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్, మీ ఎమ్మెల్యే మనకు సేవ చేస్తారని పేర్కొన్నారు. చెడుకు వ్యాప్తి వేగం ఎక్కువ. అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కళ్ళ ముందు, ఇంటి ముందు కనబడ్డ అభివృద్ధి నమ్మాలని ప్రజలకు చెప్పాలని కోరారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version