తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మాణం పై హరీశ్ రావు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగింది. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీశ్ రావు 10వేల కోట్లు సంపాదించుకున్నాడని కాళేవ్వరంలో కమీషన్లు తీసుకున్నట్టు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు.
మంత్రి కోమటి రెడ్డి ఆరోపణల పై మండిపడ్డారు హరీశ్ రావు. తాను కమీషన్లు తీసుకున్నట్టు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసెంబ్లీకి కొందరూ తాగి వస్తున్నట్టు అన్నారు. అలాంటి వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా దుమారంగా మారింది. హరీశ్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖండించారు. ఈ క్రమంలో సభలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు.