రేపు అచ్చంపేటకు వెళ్లనున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇక రాజీనామా అనంతరం స్థానిక బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను కలిశారు గువ్వల బాలరాజు.

గువ్వల బాలరాజుతో కలిసి వేరే పార్టీలోకి వెళ్లేందుకు నిరాకరించారు నేతలు, కార్యకర్తలు. తాము కేసీఆర్ విధేయులం అని బీఆర్ఎస్ పార్టీని వదిలి రామంటూ గువ్వల బాలరాజుకు తేల్చి చెప్పారు స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. దీంతో వారికి భరోసాగా ఉండేందుకు రేపు అచ్చంపేటకు వెళ్లి స్థానిక బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను కలవనున్నారు హరీష్ రావు. ఇది ఇలా ఉండగా… ఈనెల తొమ్మిదో తేదీన.. గులాబీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళనున్నారు గువ్వల బాలరాజు.