వర్షాకాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం, ఎటు చూసినా పచ్చదనం, తరచూ కురిసే వర్షాలు మనల్ని ఎంతో ఆనందింప చేస్తాయి. కానీ ఈ సీజన్ లో మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సరైన స్థాయిలో లభించదు ఇది సాధారణ సమస్య. సాధారణంగా మన శరీరం సూర్యకాంతి తో విటమిన్-డి పొందుతుంది కానీ వర్షాకాలంలో సూర్యకాంతి ఎక్కువగా ఉండదు కావున విటమిన్ డి లోపించే ప్రమాదం ఉంటుంది. మరి ఈ సీజన్ లో విటమిన్-డి లోపం రాకుండా ఉండడానికి కొన్ని సులభమైన చిట్కాలను పాటించవచ్చు. అవేంటన్నది ఇప్పుడు మనము చూద్దాం..
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనది ఇది ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరుగుదల మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం పడని రోజుల్లో ఉదయం 7 నుంచి 9 మధ్య సూర్యకాంతిని 15 నుంచి 20 నిమిషాల వరకు పొందడం మంచిది. ముఖం చేతులు, కాళ్లపై సూర్య కాంతి పడేలాగా చూసుకోవాలి.
విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోవడం ముఖ్యంగా చేయాల్సిన పని. ఆహారం ద్వారా కొంతమేర మనం విటమిన్ డి పొందవచ్చు. ముఖ్యంగా కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, మష్రూమ్స్, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, చీజ్, తీసుకోవడం వలన విటమిన్ డి శరీరానికి అందుతుంది. సూర్యకాంతిలో కొన్ని గంటలు ఉంచిన మష్రూమ్స్ విటమిన్ డి లోపాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి ఇవి మనం చేసుకునే వంటల్లో ఉపయోగించుకోవాలి.
విటమిన్ డి శరీరం లో ఎంత తగ్గిందో డాక్టర్ సలహాతో తెలుసుకొని సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ఇంతే కాక ఇంట్లోనే కనీసం 20 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయడం రోగని శక్తి మెరుగవుతుంది.
గమనిక: (పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం.)