ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. దింతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నామినేషన్ దాఖలుకు 21 చివరి తేదీ అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 22న నామినేషన్ల పరిశీలన, 25 వరకు ఉపసంహరణ ఉంటుంది.
జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయింది ఉపరాష్ట్రపతి పదవి. అనారోగ్య కారణాలతో జూలై 21న రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్…ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ తరుణంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.