పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్‌ రాజకీయం: హరీశ్‌రావు

-

లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వారెన్ని రాజకీయాలు చేసినా, దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణ వరపద్రాయిని అని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డికి చేతకాకపోతే ముఖ్యమంత్రి బాధ్యల నుంచి వైదొలిగి, తనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే.. వాళ్లు చెప్పిన పనులన్నీ చేసి చూపిస్తానని అన్నారు.  తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

“అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే.. మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వాస్తవాలు చెబుతున్నాం. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపించాలని అసెంబ్లీలో నేనే స్వయంగా కోరాను. బీఆర్ఎస్ పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టులు పనులను ఆపొద్దు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే అని దుష్ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయిన ఘటనలున్నాయి. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి తప్పితే.. ఇలాంటి వ్యాఖ్యలు తగదు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ‘మల్లన్న సాగర్’ చూపించారు కదా.. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు ఉంటే  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.” – హరీశ్ రావు

 

Read more RELATED
Recommended to you

Latest news