రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ సినిమాకి టంగ్ చేంజర్‌గా మారాడని చురకలు అంటించారు. చిత్ర పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి కాని బ్లాక్ మెయిల్ చేయకూడదన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచను అన్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇచ్చిన మాట మీద ఉండాలి.. లేదా అందరినీ సమానంగా చూడాలని పేర్కొన్నారు. నీకు నచ్చితే ఒకలాగా నచ్చక పోతే ఒకలాగా ఉంటే చిత్ర పరిశ్రమికి నష్టం జరుగుతుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ సినిమాకి టంగ్ చేంజర్‌గా మారాడు
చిత్ర పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి కాని బ్లాక్ మెయిల్ చేయకూడదు
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచను అన్నారు
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇచ్చిన మాట మీద… pic.twitter.com/CodlCSofIP
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025